పశ్చిమ బెంగాల్‌ను 2,227 కంపెనీలు విడిచిపెట్టాయని కేంద్రం తెలిపింది. 2,227 కంపెనీల్లో 39 లిస్టెడ్ కంపెనీలని కేంద్రమంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. ఈ కంపెనీలు పరిపాలన, సౌలభ్యం, ఖర్చు-ప్రభావం, ఇతర రాష్ట్రాల్లో మెరుగైన అవకాశాల వంటి కొన్ని కారణాలతో రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని ఆయన పేర్కొన్నారు.