తన పీసీపీ పదవి పోతుందన్న భయంతోనే రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో రేవంత్ రెడ్డి సతమతమవుతున్నారని.. మునుగోడు ఉప ఎన్నిక(Munugodu By polls)ల్లో రూ.25 కోట్లు రేవంత్ రెడ్డికి ఇచ్చానని ఈటెలరాజేందర్ ఎక్కడ అనలేదన్నారు.
Bandi Sanjay : హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala rajendar), టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth reddy) మధ్య ఆసక్తి కర పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీపై ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై ప్రమాణం చేసేందుకు భాగ్యలక్ష్మి(bhagyalaxmi temple) అమ్మవారి ఆలయానికి వచ్చిన రేవంత్ రెడ్డి భావోద్వోగం చెందారు. దీనిపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) వ్యాఖ్యానించారు. తన పీసీపీ పదవి పోతుందన్న భయంతోనే రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో రేవంత్ రెడ్డి సతమతమవుతున్నారని.. మునుగోడు ఉప ఎన్నిక(Munugodu By polls)ల్లో రూ.25 కోట్లు రేవంత్ రెడ్డికి ఇచ్చానని ఈటెలరాజేందర్ ఎక్కడ అనలేదన్నారు. పార్టీకి ఇచ్చానని మాత్రమే అన్నారని స్పష్టం చేశారు.
త్వరలో జరగనున్న కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఆర్థిక సహాయం చేస్తుందన్నారు బండి సంజయ్.. రాజ్దీప్ సర్దేశాయి కూడా.. బీఆర్ఎస్(BRS) దేశమంతా పార్టీలకు ఆర్థిక సాయం చేస్తుందనే అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దానికి ప్రూఫ్ లు ఉన్నాయన్నారు. రాష్ట్రంలోనూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) , బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని బండి సంజయ్ ఆరోపించారు. ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సైతం ఇవే మాటలు అంటున్నారన్న ఆయన.. బీఆర్ఎస్ వద్ద కాంగ్రెస్ డబ్బులు తీసుకున్న మాట వాస్తవమని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల సందర్భంతోనూ మునుగోడులో ఇదే విషయం ప్రచారం అయిందన్నారు. ఓటర్లే మునుగోడులో స్వయంగా మాట్లాడుకున్నారని తెలిపారు. అంతకుముందు మహాత్మ బసవేశ్వర జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్(Tankband) వద్ద ఉన్న బసవేశ్వర విగ్రహానికి బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ తో కలిసి పూల మాలలు వేశారు.