CM KCR Delhi Tour:తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్పై (cm kcr) ప్రజల సమస్యలు పట్టవని మండిపడ్డారు. అకాల వర్షంతో అన్నదాతలు అల్లాడుతుంటే ఢిల్లీ ఎందుకు వెళతున్నారని ప్రశ్నించారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో తడిసిన ధాన్యం ఆరబోస్తున్న రైతుల వద్దకు బండి సంజయ్ వెళ్లారు. తర్వాత గంభీరావుపేట సమీపంలో గల ఐకేపీ సెంటర్లో తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతులను కలిశారు. అక్కడినుంచి నాగంపేట గ్రామంలో వడగళ్ల వానతో ముంపునకు గురయిన పొలాలను పరిశీలించారు.
రాష్ట్రంలో ప్రభావం ఉందా అని బండి సంజయ్ (Bandi Sanjay) అడిగారు. ప్రజల సమస్యలు తెలుసుకోలేని సీఎం (cm) ఎందుకు అని అడిగారు. రైతులు అల్లాడిపోతుంటే కేసీఆర్ (kcr) ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారని అడిగారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలని కోరారు. నిర్ణీత వ్యవధిలో కొనుగోలు కేంద్రాలు తెరచి ఉంటే 30 శాతం రైతులు నష్టపోయేవారు కాదన్నారు. పంట నష్టపోయిన ప్రాంతాల్లో కేసీఆర్ (kcr) పర్యటించాలని.. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సాయంపై చర్చిస్తామని బండి సంజయ్ (bandi sanjay) స్పష్టంచేశారు.
పంచాయతీ సెక్రటరీల సమ్మెకు మద్దతు తెలుపుతున్నామని బండి సంజయ్ (Bandi Sanjay) పేర్కొన్నారు. వారి సమస్యపై సీఎం కేసీఆర్కు (cm kcr) బహిరంగ లేఖ రాస్తున్నామని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులే కాదు.. అన్ని శాఖల ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. చాకిరీ చేసి ప్రభుత్వానికి అవార్డులు తెచ్చారని.. అయినా వారి పట్ల దయ, కరుణ చూపడం లేదన్నారు. నాలుగేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ ఏంటీ అని అడిగారు. సమయం ముగిసినప్పటికీ ఇంకా రెగ్యురల్ చేయకపోవడం సరికాదన్నారు. కేసీఆర్కు (kcr) కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందన్నారు. వచ్చే 5 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయని.. ప్రజలు బుద్ది చెబుతారని బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు.