AP: విశాఖలో ఇవాళ్టి నుంచి రెండ్రోజుల పాటు భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఈ సదస్సును ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రారంభించనున్నారు. అలాగే, వివిధ దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు తరలివచ్చారు. ఇవాళ, రేపు దాదాపు రూ.10 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. సదస్సులో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, చంద్రబాబు, లోకేష్, పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు పాల్గొననున్నారు.