వర్షాలతో దేశంలో కరెంటు డిమాండ్ గణనీయంగా తగ్గి కొనుగోలు ధరలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ‘భారత ఇంధన ఎక్స్ఛేంజీ(IEX)లో కొన్ని సమయాల్లో యూనిట్ కరెంట్ ధర ఏకంగా 2 పైసలకు పడిపోయింది. మరోవైపు తెలంగాణ డిస్కంలు ఈ నెల 5న 4 కోట్ల యూనిట్లను సగటున రూ.2 చొప్పున కొనుగోలు చేశాయి. సగటు ధర ఈ స్థాయిలో ఉన్నా కొన్ని స్లాట్లలో కేవలం 50 పైసలకే యూనిట్ లభిస్తోంది.