AP: సీజనల్ వ్యాధులు, మందుల పంపిణీ సహా పలు అంశాలపై సీఎస్ విజయానంద్ ఈరోజు జిల్లా కలెక్టర్లతో సమీక్షించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో సానుకూల ప్రజా అవగాహన, ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ్ యోజన పురోగతి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, పెన్షన్లు తదితర అంశాలపై చర్చించనున్నారు.