ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రారంభమైంది. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఉప రాష్ట్రపతి ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ తొలి ఓటు వేశారు. NDA అభ్యర్థిగా CP రాధాకృష్ణన్, విపక్షాల అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి తలపడుతున్నారు. సా. 5 గంటల వరకు పోలింగ్ జరుగనుండగా 6 గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు.