పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళఖాతం వద్ద అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కాగా, ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని చోట్ల నిన్నటి నుంచి వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే.