Ajinkya Rahane: 11 ఏళ్ల ధోని రాకార్డు బద్దలు కొట్టిన రహానే
నిన్న జరిగిన ముంబై ఇండియన్స్ (mumbai indians), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మ్యాచ్‌లో అజింక్య రహానే(Ajinkya Rahane) అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. దీంతో CSK మ్యాచ్ గెలవడంతోపాటు 11 ఏళ్ల ధోని రికార్డును సైతం రహానే చేధించాడు.
నిన్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆడిన అజింక్య రహానే(Ajinkya Rahane) సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ సీజన్లో అత్యంత వేగవంతమైన 50 పరుగులు చేశాడు. ఈ మైలురాయిని చేరుకోవడానికి రహానే కేవలం 19 బంతులు మాత్రమే ఎదుర్కొవడం విశేషం. అంతేకాదు టోర్నమెంట్లో కెప్టెన్ MS ధోని(ms dhoni) యొక్క 11 ఏళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టాడు.
రహానే కేవలం 19 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. దీంతో 2022లో మోయిన్ అలీ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఘనతకు చేరువయ్యాడు. మరోవైపు 2014లో పంజాబ్ కింగ్స్‌పై 16 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన సురేశ్ రైనా ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నాడు. 2012లో ముంబై ఇండియన్స్(mumbai indians)తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ 20 బంతుల్లో ఈ ఘనత సాధించి జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.
నేను ఎప్పుడూ వాంఖడేలో ఆడటం ఆనందిస్తాను. నేను ఇక్కడ ఎప్పుడూ టెస్టు ఆడలేదు. ఇక్కడ టెస్టు ఆడాలనుకుంటున్నాను. మహి భాయ్ ఫ్లెమింగ్ గురించి ముఖ్యమైన విషయం ఏమిటంటే వారు అందరికీ స్వేచ్ఛ ఇస్తారు. బాగా ప్రిపేర్ అవ్వమని మహీ భాయ్ నాకు చెప్పాడని రహానే మ్యాచ్ అనంతరం వెల్లడించారు.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ ఎనిమిది వికెట్ల నష్టానికి 157 రన్స్ చేయగా, తర్వాత 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లలో మొదటి ఇద్దరు తడబడ్డారు. కానీ రహానే 27 బంతుల్లో 61 రన్స్ చేసి CSK మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. రహానే CSK తరఫున ఆడిన తొలి మ్యాచ్ లోనే ఈ ఘనత సాధించడం విశేషం. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్ గాయంతో బాధపడుతున్న వేళ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టును రహానే ఆదుకున్నాడనే చెప్పవచ్చు.