AP: వైసీపీ నేత, మాజీమంత్రి ఆళ్లనాని ఇవాళ టీడీపీలో చేరనున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా, 2019లో వైసీపీ తరపున గెలుపొందిన ఆళ్ల నాని.. జగన్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 62 వేలకు పైగా ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి బడేటి చంటి చేతిలో ఓడిపోయారు.