ASR: తుఫాన్, భారీ వర్షాలు హెచ్చరికల నేపథ్యంలో నేటి నుంచి దేవీపట్నం పోశమ్మ ఘాట్ నుంచి పాపికొండలు బోట్ విహార యాత్ర నిలిపి వేస్తున్నామని రంపచోడవరం సబ్ కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి ప్రకటించేంత వరకు టూరిజం బోట్ యాత్ర నిలిపి వేయాలని ఆదేశించారు. పర్యాటకులు సహకరించాలని ఆయన కోరారు