పార్లమెంటు వెలుపల బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలు చేపట్టాయి. రాజ్యసభలో అంబేడ్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టింది. అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. నిరసనలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీనే అంబేడ్కర్‌ను అవమానించిందని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీల నిరసన చేపట్టారు.