NLR: జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు సంగం పోలీస్ స్టేషన్ వద్ద సంగం ఎస్సై రాజేష్, ఏఎస్ పేట ఎస్సై సైదులు, సిబ్బంది యోగా చేశారు. ఈ సందర్భంగా గంట సేపు పలు యోగాసనాలు వేశారు. అనంతరం యోగా గురువు పెంచలయ్య మాట్లాడుతూ.. విధి నిర్వహణలో మానసిక ఒత్తిడికి గురికాకుండా ఈ యోగా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.