అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఆర్థిక సాధికారతపై ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ దిగ్గజం SBI ప్రత్యేక దృష్టితో 50 కోట్ల డాలర్ల సిండికేటెడ్ సోషల్ టర్మ్ లోన్ ఫెసిలిటీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో లింగ సమానత్వం, సమ్మిళిత ఆర్థిక వృద్ధికి మద్దతిచ్చే లక్ష్యంతో ఈ తరహా సిండికేటెడ్ లావాదేవీని ఎస్బీఐ ప్రారంభించడం ఇదే తొలిసారి.