ప్రతిరోజు ఉదయం యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం యోగా చేయడం వల్ల రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఒత్తిడి తగ్గి డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గుతాయి. అధిక రక్తపోటు తగ్గుతుంది. కండరాలు దృఢంగా మారుతాయి.