AP: టీడీపీ పార్లమెంట్ కమిటీలపై పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ కమిటీల ఏర్పాటు కోసం ఇప్పటికే ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. మొత్తం 34 మంది సభ్యులతో ఒక్కో పార్లమెంట్ కమిటీ ఏర్పాటు కానుంది. అదే విధంగా 28 మందితో పార్లమెంట్ స్థాయిలో అనుబంధ విభాగాల కమిటీలపైనా అభిప్రాయాల సేకరణ చేయనున్నారు.