NZB: రూరల్ మోపాల్, ముదక్ పల్లిలో శనివారం రాత్రి కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముదక్ పల్లిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం, మోపాల్ మండల కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్ ఆయన సందర్శించారు. హాస్టళ్లలో విద్యార్థుల హాజరును పరిశీలించి, రాత్రి భోజనంలో అందించిన ఆహార పదార్థాలు మెనూకు అనుగుణంగా ఉన్నాయా అని తనిఖీ చేశారు.