ATP:జిల్లా పారా స్పోర్ట్స్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 28న డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు శనివారం తెలిపారు. ఈ సత్తాచాటిన క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల జట్లు పాల్గొనవచ్చన్నారు.