పద్మశ్రీ అవార్డు గ్రహీత సాలుమరద తిమ్మక్క తుదిశ్వాస విడిచారు. వృక్షమాతగా పేరుగాంచిన ఆమె 114 ఏళ్ల వయస్సులో శ్వాస సంబంధిత సమస్యలతో బెంగుళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ మేరకు తిమ్మక్క కుటుంబ సభ్యులు వివరాలను వెల్లడించారు. తిమ్మక్క మృతి పట్ల కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె సేవలకు గానూ కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది.