TG: ఈడీ కార్యాలయం ఎదుట టీ.కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరిని నిరసిస్తూ టీపీసీసీ ఇవాళ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈడీ ఛార్జిషీట్లలో సోనియా, రాహుల్ పేర్లను కక్షపూరితంగా చేర్చిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు.. ‘మోదీ, ఈడీ.. డౌన్ డౌన్ అంటూ’ నినాదాలు చేశారు. ఈ ధర్నాలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.