AP: బాలల దినోత్సవం సందర్భంగా మంత్రి లోకేష్ పిల్లలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ‘పిల్లలంటే నాకు ప్రాణం. కల్మషం లేని వారి చిరునవ్వులు నాకెంతో ఇష్టం. బాలలను బాధ్యతాయుతమైన భారత పౌరులుగా మార్చాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రభుత్వ స్కూళ్లలో ఆటపాటలతో కూడిన చదువులకు వాతావరణం కల్పిస్తున్నాం. పిల్లల సమగ్ర వికాసానికి కృషి చేస్తున్నామ’ని ట్వీట్ చేశారు.