మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పార్థివదేహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. మన్మోహన్సింగ్ కుటుంబాన్ని పరామర్శించారు. దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారని అన్నారు. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని కొనియాడారు. మన్మోహన్సింగ్ మరణం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఆయన అనేక ఉన్నత పదవులు నిర్వర్తించారని గుర్తు చేశారు.