మహారాష్ట్ర Dy. CM ఏక్నాథ్ శిందే ‘X’ ఖాతా హ్యాక్ అయింది. ఈ క్రమంలో హ్యాకర్లు ఆయన అకౌంట్లో పాకిస్తాన్, తుర్కియే దేశాల జెండాలు ఉన్న పోస్టులను షేర్ చేయడం కలకలం రేపుతోంది. ఆసియా కప్‌లో భారత్-పాక్‌ల మధ్య ఇవాళ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో శిందే ఖాతా నుంచి ఆ దేశాల ఫొటోలను పోస్టు చేయడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.