AP: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇస్లాం మతంలో పవిత్రమైన ఈ రంజాన్ నెలలో ఉపవాసదీక్షలు, ప్రార్థనలు మనసును పవిత్రం చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. పేదలకు దానం చేయడం ద్వారా సమాజంలో సమానత్వం పెరుగుతుంది. ఈ రంజాన్ మీ జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పేర్కొన్నారు.