ప్రభుత్వ బ్యాంకులతో సంపన్నులకే మేలు జరుగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. మోదీ హయాంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు.. ప్రైవేటు ఫైనాన్షియర్లలా మారాయని ఆరోపించారు. సామాన్యులకు సేవలందించాల్సిన బ్యాంకులు లాభాపేక్షతో పనిచేస్తున్నాయన్నారు. సిబ్బంది కొరత, పని వాతావరణం కారణంగా బ్యాంకులు లక్ష్యాలను చేరుకోలేకపోతున్నాయని చెప్పారు. వారి మోసపూరిత స్నేహితులకు అపరిమిత నిధులిచ్చే సంస్థలుగా బ్యాంకులను చూడటం మోదీ ప్రభుత్వం మానుకోవాలని పేర్కొన్నారు.