HYD: నగరంలో అనేక చోట్ల బీసీ బంద్ కొనసాగుతోంది. అయితే పెట్రోల్ బంకుల బంద్ సైతం కొనసాగుతుందని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపినప్పటికీ, పెట్రోల్ బంకులు అనేక చోట్ల ఓపెన్ చేసి ఉన్నాయి. మరోవైపు ప్రైవేటు వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సిందేనని అనేక చోట్ల నిరసన తెలుపుతున్నారు.