దర్శకుడు మేర్లపాక గాంధీతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరో సినిమాకు ఓకే చెప్పారట. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో వరుణ్ నటించనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు, 2026లో అమెరికాలో కీలక షెడ్యూల్ జరగనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందట .