TG: మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలకు సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా రాష్ట్ర సచివాలయ సమీపంలో మన్మోహన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా ఆయన పేరు మీద ఓ కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. విగ్రహ ఏర్పాటు కోసం స్థలాన్ని చూడాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు సమాచారం.