ప్రపంచంలోనే అతి పెద్ద మ్యూజియం ఈజిప్టులో ప్రారంభమైంది. కైరోలోని గాజా పిరమిడ్ల దగ్గర నిర్మించిన దీనికి దాదాపు రూ.8,320 కోట్లు ఖర్చు అయింది. ఈజిప్టు పురాతన నాగరికతను ప్రతిబింబించేలా ఇందులో 50 వేల వరకు కళాఖండాలు కొలువుదీరాయి. ఇందులో రాజు తుతున్కమాన్కు చెందినవే 5000 వరకు ఉన్నాయి. దీని వైశాల్యం 24 వేల చ. మీ ఉండగా.. ఇందులో 12 ప్రధాన గ్యాలరీలు ఉన్నాయి.