ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ పొత్తు పెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్కు 15 స్థానాలు కేటాయించేందుకు చివరి దశలో చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. 1-2 స్థానాలు ఇండియా కూటమిలోని ఇతర పార్టీలకు కేటాయించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే ఆప్ రెండు విడతల్లో 31 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.