ఫుడ్ కల్తీపై మంత్రి దామోదర రాజనరసింహా స్పందించారు. కల్తీ ఆహారం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. త్వరలో జిల్లాల్లో ఫుడ్ టెస్టింగ్ వాహనాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఫుడ్యాక్ట్ ద్వారా 6 వేల టెస్ట్లు జరిగాయని.. రూ.60 లక్షల జరిమానాలు విధించామని వివరించారు. రాష్ట్రంలో నలు దిక్కులా 4 టెస్టింగ్ ల్యాబ్స్ అవసరమని పేర్కొన్నారు. ఎవరైనా కల్తీకి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.