విజయవాడ టెర్రర్ లింక్స్ కేసుకు సంబంధించి A5 సైదాబేగం(HYD) విచారణలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించడమే లక్ష్యంగా ఆమె ఇప్పటికే 42 మందిని రిక్రూట్ చేసినట్లు తేలింది. KHAWATEEN అనే వాట్సప్ గ్రూప్లో జిహాదీల ఆదేశాలను షేర్ చేసినట్లు గుర్తించారు. మదర్సాల్లో మతపరమైన శిక్షణ, ఆపై ఆయుధ శిక్షణకు సన్నాహాలు చేసినట్లుగా పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.