AP: ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్‌షాను లోక్‌సభలో జనసేన పక్ష నేత బాలశౌరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడిన షా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్రౌడ్ పుల్లర్ అంటూ ప్రశంసలు కురిపించారు. మహారాష్ట్రలో పవన్ ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో మహాయుతి కూటమి అభ్యర్థులు విజయం సాధించారన్నారు. మహారాష్ట్ర ప్రజల్లో జనసేనానికి ఉన్న ఆదరణతో తమ గెలుపులో ఆయన భాగస్వామ్యమయ్యారని షా పేర్కొన్నారు.