బీహార్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించడంతో NDA విజయం అపూర్వం, చరిత్రాత్మకం అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ విజయంతో ఆశీర్వదించిన ప్రజలకు, ప్రతిపక్షాల అబద్ధాలను తిప్పికొట్టిన కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘బీహార్ అభివృద్ధి, సాంస్కృతిక గుర్తింపునకు కృషి చేస్తాం. ఈ తీర్పు నూతన సంకల్పంతో పనిచేయడానికి శక్తినిచ్చింది’ అని ప్రధాని పేర్కొన్నారు.