TG: ఆదిలాబాద్ జిల్లాలో నిన్నరాత్రి కలెక్టరేట్ స్లాబ్ కుప్పకూలింది. రాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. స్లాబ్ వ్యర్ధాలు ఉండటంతో ఆఫీస్కు వెళ్లే మార్గం మూసివేశారు. నిన్నరాత్రి నుంచి శిథిలాలు తొలగించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. పాత భవనానికి తాత్కాలిక మరమ్మతులు చేయడం వల్ల ఇలా జరిగినట్లు సమాచారం.