TG: ప్రభుత్వం అడ్డగోలుగా బస్సు ఛార్జీలు పెంచిందని మాజీమంత్రి హరీష్ రావు మండిపడ్డారు. దీనికి నిరసనగా ‘చలో బస్ భవన్’కు పిలుపునిస్తే, నేతలను హౌస్ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అన్నారు. ‘ఇందిరమ్మ పాలన అంటే హౌస్ అరెస్ట్లు చేయడమేనా?’ అని ప్రశ్నించారు. రెండేళ్లలో నాలుగుసార్లు ఛార్జీలు పెంచారని.. మహిళలకు ఫ్రీ అంటూ, పురుషులకు రెట్టింపు భారం వేస్తున్నారని విమర్శించారు.