చాలా మంది రైతులు పంటకొత పూర్తయిన తర్వాత నిప్పు పెడుతున్నారు. అయితే దీని వల్ల భూసారం తగ్గి తదుపరి పంటల దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈదురు గాలులు వీస్తుండడంతో మంటలు వేగంగా వ్యాపించి మోటర్లు, వైర్లు దగ్దమయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అలాగే చిన్న చిన్న ప్రాణులు, పక్షులు, పాములు అగ్నికి ఆహుతి అవుతాయని హెచ్చరిస్తున్నారు.