ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లక్నోలోని కాకోరిలో వంతెనపై నుంచి బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఘటనాస్థలంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.