ప్రభుత్వ కొలువు అంటే హాట్ కేకు. చిన్న జాబ్ అయినా ఫర్లేదు ఇంట్రెస్ట్ చూపించేవారు చాలామంది ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్, క్లర్క్ పోస్టులకు కూడా డిమాండ్ ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేపడుతోంది. గ్రూప్-4 పోస్టులకు చాలా మంది నిరుద్యోగులు ఆప్లై చేస్తున్నారు. ఇప్పటికే 5 లక్షల మంది దరఖాస్తు చేశారంటే.. జాబ్ కోసం ఏ స్థాయిలో పోటీ పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. దరఖాస్తు చేసేందుకు గడువు ఈ నెల 30వ తేదీ వరకు ఉంది. అంటే మరో 3 లక్షల మంది కూడా ఆప్లై చేస్తారని టీఎస్పీఎస్సీ లెక్కలు వేస్తోంది.
8039 పోస్టులకు టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. గత నెల 30వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. రోజుకు యావరేజీగా 20 వేలకు పైగా అప్లికేషన్లు వస్తున్నాయట. గ్రూప్ 4లో మూడు క్యాటగిరీలకు సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 6,859, 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, 18 జూనియర్ ఆడిటర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు.
అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్ డిపార్ట్ మెంట్-44, యానిమల్ హస్పెండరీ, డెయిరీ డెవలప్ మెంట్ అండ్ ఫిషరీస్-2, బీసీ వెల్ఫేర్-307, కన్స్జూమర్ ఎఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్ మెంట్-72, ఎనర్జీ డిపార్ట్ మెంట్-2, ఎన్విరాన్ మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్-23, ఫైనాన్స్-255, జనరల్ అడ్మినిస్ట్రేషన్-5, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్-338, ఉన్నత విద్యాశాఖ-742, హోమ్ డిపార్ట్ మెంట్-133, పరిశ్రమలు అండ్ వాణిజ్య శాఖ-7, వ్యవసాయ శాఖ-51, కార్మిక, ఉపాధి కల్పన శాఖ-128, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్-191, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్-2701, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్-1245, ప్లానింగ్ డిపార్ట్ మెంట్-2, రెవెన్యూ-2077, ఎస్సీ డెవలప్ మెంట్-474 పోస్టులు ఉన్నాయి.