AP: నంద్యాల జిల్లా జనగానపల్లె నియోజకవర్గంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. కోవెలకుంట్ల, సంజామల మండలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. దెబ్బతిన్న రోడ్లను పరిశీలించి పునరుద్ధరణ పనులు త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు.