రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ వాసుదేవ్ దేవ్నానీ కారును అనుమానాస్పద వాహనం వెంబడించింది. దేవ్నానీ మంగళవారం జైపూర్ నుంచి అజ్మీర్‌కు వెళుతుండగా ఆయన కారును ఓ వాహనం వెంబడించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. వారు తమ మొబైల్ ఫోన్లతో అతని కారును వీడియో కూడా చిత్రీకరించినట్లు సమాచారం. ఆయన కారు వెంబడి ఉన్న ఎస్కార్ట్ పోలీసులను అప్రమత్తం చేయడంతో.. ఆయన భద్రతను నిర్ధారించడానికి బృందాలను హైవేపైకి పంపించారు.