నల్ల జీలకర్రలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు C, A, B, ఖనిజాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కీళ్ల నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తాయి. అంతేకాదు కొలెస్ట్రాల్ స్థాయిలను, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి. జుట్టు, చర్మ సమస్యలను నివారిస్తాయి.