AP: ప్రభుత్వం పెన్షన్దారులకు గుడ్న్యూస్ చెప్పింది. ఒకరోజు ముందుగానే పెన్షన్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. MAR 1న ఆదివారం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలకు హాలిడే ఉంటుంది. దీంతో ఈనెల 28వ తేదీన శనివారం పెన్షన్లు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు వెళ్లాయి. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని స్పష్టం చేశారు.