Karnataka:ఎన్నికల సమీపిస్తున్న వేళ.. కర్ణాటకలో 40 కేజీల బంగారం పట్టివేత
కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లా తరికెరె (Tarikere) నియోజకవర్గంలో ఎన్నికల అధికారులు 40 కేజీల బంగారం, 20 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.23.51కోట్లుగా వెల్లడించారు.
Huge gold are recovered at vijayawada railway station
Karnataka: కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లా తరికెరె (Tarikere) నియోజకవర్గంలో ఎన్నికల అధికారులు 40 కేజీల బంగారం, 20 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.23.51కోట్లుగా వెల్లడించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందువల్ల రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో మొత్తం 40.59 కేజీల బంగారం, 20.7కేజీల వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటివరకూ 1714 ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేశామని అధికారులు వివరించారు.
మార్చి 29న ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో కర్ణాటకలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు దాదాపు రూ.240 కోట్లను స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో రూ.80 కోట్ల నగదు, రూ.48 కోట్ల మద్యం, రూ.78 కోట్ల విలువైన బంగారం, వెండి, రూ.19 కోట్ల విలువైన బహుమతులు, రూ.16 కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నాయి. జప్తులకు సంబంధించి 1714 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందే (మార్చి 9 నుంచి మార్చి 27 వరకు) దాదాపు రూ.58 కోట్లు పట్టుబడ్డాయి. కర్నాటకలో మే 10న పోలింగ్, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.