భోజనం చేసేటప్పుడు చాలామంది నీళ్లను ఎక్కువగా తాగుతుంటారు. ఇలా చేయడం మంచిది కాదని, అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. కడుపులో గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అలాగే బరువు పెరిగే అవకాశం ఉంది. భోజనం చేసే సమయంలో సోడాలు, కూల్డ్రింక్స్ వంటివి తాగకూడదు. అయితే భోజనం చేయడానికి అరగంట ముందు నీళ్లు తాగితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.