AP: విద్యుత్ ఛార్జీలపై YCP నిరసనలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు. తాను పెంచిన ఛార్జీలపై తన పార్టీ శ్రేణులతో ధర్నాలు చేయించటం సైకో చర్యని అభివర్ణించారు. విద్యుత్ కొనుగోళ్ల కోసం అదనంగా రూ.19 వేల కోట్లు ఖర్చు చేయడం నిజం కాదా అని నిలదీశారు. కమీషన్ల కోసం యూనిట్‌ను రూ.8 నుంచి రూ.14కి కొనుగోలు చేసింది జగన్ కాదా అని ప్రశ్నించారు.