నేటి సమాజంలో ‘డ్యుయల్ ఇన్కమ్, నో కిడ్స్’ (DINK) విధానాన్ని అనేక జంటలు అనుసరిస్తున్నాయి.నేటి ఆధునిక జీవన శైలిలో అనేక జంటలు పిల్లల బాధ్యతలు, పెంచే ఖర్చుల నుంచి తప్పించుకునేందుకు ఈ డింక్ పద్ధతినే అనుసరిస్తున్నారు. ఇద్దరూ సంపాదించేవారు కావడం వల్ల ఆర్థికంగా ఎంతో బలంగా ఉంటామని వీరు భావిస్తుంటారు. అయితే ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదని ఆర్థిక నిపుణులు గుర్తిస్తున్నారు.