పార్లమెంట్ ఉభయ సభలు నాలుగో రోజు ప్రారంభం కాగానే విపక్షాల ఆందోళనతో గందరగోళం నెలకొంది. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు విపక్షాలు పట్టుబట్టి, ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశాయి. విపక్ష సభ్యుల తీరును స్పీకర్ ఓం బిర్లా తప్పుబట్టారు. లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభా మర్యాద పాటించాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని స్పీకర్ సూచించారు.