»32 Year Old Woman Dies After Being Stuck In Lift For Three Days In Uzbekistan
Lift accident: మూడు రోజుల పాటు లిఫ్టులో నరకం.. భరించలేక 32 ఏళ్ల మహిళ మృతి
ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్లో మూడు రోజుల పాటు లిఫ్ట్‌లో చిక్కుకుని 32 ఏళ్ల మహిళ మరణించింది. మూడు రోజులుగా అక్కడ చిక్కుకున్న ఆమెను రక్షించడానికి ఎవరూ రాలేదు. మూడురోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు.
Lift accident: ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్లో మూడు రోజుల పాటు లిఫ్ట్‌లో చిక్కుకుని 32 ఏళ్ల మహిళ మరణించింది. మూడు రోజులుగా అక్కడ చిక్కుకున్న ఆమెను రక్షించడానికి ఎవరూ రాలేదు. మూడురోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. తొమ్మిది అంతస్తుల భవనం పై అంతస్తు నుండి సహాయం కోసం అరిచింది. కానీ దురదృష్టవశాత్తు ఎవరూ ఆమె గొంతు వినలేదు. మృతురాలి పేరు ఓల్గా లియోంటివా.. పోస్టల్ శాఖలో పనిచేసేవారు. ఆమె యధావిధిగా విధులు ముగించుకుని ఇంటికి రాకపోవడంతో, జూలై 24న ఆమె కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చాలా ప్రాంతాల్లో వెతికిన తర్వాత మూడో రోజు మృతదేహం లిఫ్ట్‌లో కనుగొనబడింది. ఆమెకు ఆరేళ్ల కుమార్తె ఉంది. తను ప్రస్తుతం బంధువుల సంరక్షణలో ఉంది.
ఈ ఘటనపై ప్రాసిక్యూటర్ కార్యాలయం విచారణ ప్రారంభించింది. ఈ సమయంలోనే చైనా తయారు చేసిన లిఫ్ట్ రిజిస్టర్ కానప్పటికీ పని చేసే స్థితిలో ఉన్నట్లు కనుగొనబడింది. సంఘటన జరిగిన రోజు విద్యుత్ కోత లేదని ప్రాంతీయ విద్యుత్ నెట్వర్క్ ధృవీకరించింది. స్థానికుల వాంగ్మూలాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రమాదానికి కారణం లిఫ్ట్‌లో లోపం అని తేలింది. గత వారం ఇటలీలోని పలెర్మోలో ఇలాంటి సంఘటనే జరిగింది. అక్కడ 61 ఏళ్ల ఫ్రాన్సిస్కా మార్చియోన్ అనే మహిళ విద్యుత్ కోత సమయంలో లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి చనిపోయింది. జులై 26న విద్యుత్ కోత ఏర్పడి నివాస భవనాన్ని అంధకారంలోకి నెట్టింది. సంఘటనా స్థలానికి అత్యవసర సేవలను పిలిచారు. కానీ విషాదకరంగా.. వారు రెండు అంతస్తుల మధ్య చిక్కుకున్న లిఫ్టులో మార్చియోన్ మృతదేహాన్ని కనుగొన్నారు. ప్రమాదాలకు ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి రెండు కేసులను ఇప్పుడు క్షుణ్నంగా దర్యాప్తు చేస్తున్నారు.