AP: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతోంది. శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలతో ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, శ్రీకాకుళం ASP కేవీ రమణ, దేవాదాయశాఖ సహాయ కమిషనర్ ప్రసాద్ ఉన్నారు. తొక్కిసలాటకు గల కారణాలను పరిశీలించి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.